telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ స్టార్లపై సీఏఐటీ ఫైర్

BC

ఇటీవల భారత్, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవానులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. దీంతో ఒకవైపు మన సైనికులు చైనా సరిహద్దుల్లో చనిపోతుంటే.. మరోవైపు మన సినీ ప్రముఖులు చైనా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) మండిపడింది. బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు చైనా ఉత్పత్తులను ఎండార్స్ చేయడం వెంటనే అపెయ్యాలని సీఏఐటీ డిమాండ్ చేసింది. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, విరాట్ కోహ్లీ చైనా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని, వెంటనే తమ అగ్రిమెంట్లను వీరు క్యాన్సిల్ చేసుకోవాలని సీఏఐటీ కోరింది.

Related posts