telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ కోసం రంగంలోకి ఇంటర్నేషనల్ మేకప్ మెన్ ?

Nithin

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’తో భారీ స‌క్సెస్ త‌ర్వాత వ‌రుస సినిమాలను లైన్ లో పెట్టారు. బాలీవుడ్ చిత్రం ‘అందాదున్’ రీమేక్‌లో, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాల్లో న‌టించాల్సి ఉండ‌గా, వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక నితిన్ లిస్టులో ఉన్న చిత్రాల్లో ‘ప‌వ‌ర్ పేట’ సినిమా ఒక‌టి. ఇది రెండు భాగాలుగా రూపొందనుంది. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. పొలిటిక‌ల్ ట‌చ్‌తో సాగే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇందులో నితిన్ 20 ఏళ్ల యువ‌కుడిగా, 40 ఏళ్ల వ్య‌క్తిగా, 60 ఏళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌తాడ‌ని ఇది వరకే వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో నితిన్‌ను మూడు డిఫ‌రెంట్ లుక్స్‌లో చూపించ‌డానికి ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమాల్లో ప‌ని చేసిన మేక‌ప్ ఆర్టిస్ట్‌ను ర‌ప్పించాల‌ని అనుకుంటున్నారట‌. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts