telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రేపటి నుండి ఢిల్లీలో మెట్రో పరుగులు!

metro train delhi

కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు నిలిచిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఢిల్లీ లో మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది. యూపీఎస్సీ పరీక్షల కోసం మెట్రో రైళ్ల సర్వీసు సేవలను పున: ప్రారంభించాలని ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ మెట్రో యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అక్టోబర్ 4న ఉదయం 6 గంటలకు మెట్రో సేవలను ప్రారంభించనుంది. ఈ అంశంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ట్వీట్ చేసింది.

యూపీఎస్సీ పరీక్షకు విద్యార్థులను సులభతరం చేయడానికి, అక్టోబర్ 4న అన్ని లైన్ల టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6 గంటలకు ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. కోవిడ్-19 మరియు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలను దృష్టిలో ఉంచుకుని యూపీఎస్‌సీ పరీక్షను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని అంతకుముందు సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విధితమే.

Related posts