తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీప్రాంతంలో యురేనియం ఖనిజం తవ్వకాలపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు కోదండరాం మరికొందరు టీజేఎస్ నేతలతో కలిసి అక్కడకు బయలుదేరారు.
ఈ క్రమంలో మార్గమధ్యంలోనే అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద పోలీసులు కోదండరాంను అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసుల చర్యపై ఆగ్రహించిన గిరిజనులు శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా