telugu navyamedia
రాజకీయ వార్తలు

కష్టపడి పనిచేయండి.. ఎంపీలకు మోదీ సూచన

modi on jammu and kashmir rule

కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు సూచనలు చేశారు. దేశ రాజధానిలో కొత్త ఎంపీల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ 2024లో తన పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకోకుండా, స్వయంకృషితో గెలవాలని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తే, తన పేరు, ప్రతిష్ఠలపై ఎవరూ ఆధారపడక్కర్లేదని సూచించారు.

నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేయడం ద్వారా ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని వివరించారు. “మీరు ఎన్నికల్లో గెలిచారు. మీకింకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. మీ నియోజకవర్గం కోసం కష్టపడి పనిచేయండని మోదీ ఉద్బోధించారు.  మానవ వనరులను ఉపయోగించుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ వివరాలను బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీడియాకు వెల్లడించారు.

Related posts