telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ర్టాల్లో పెరిగిన‌ చ‌లి తీవ్ర‌త‌..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది.సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణ ఏజెన్సీల్లో మంచు కమ్మేసింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంచు కారణంగా రోడ్లు కనబడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు వీపరీతంగా పడిపోయాయి. దాంతో చలికి ఏజెన్సీ మండలాల ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి తోడు పలు గ్రామాలను పొగ మంచు కమ్మేస్తోంది. ఉదయం 9 గంటలు దాటితే గాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. గ్రామాల్లో ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని చలి నుంచి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

Temperatures dip across Telangana as winter peaks

విశాఖ ఏజెన్సీ అరకు వ్యాలీలో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మినుములూరులో అత్యల్పంగా 7 డిగ్రీలుకాగా.. పాడేరులో 9, చింతపల్లిలో 9.8 డిగ్రీలు నమోదయ్యాయి.

మ‌రోవైపు హైదరాబాద్​తో పాటు తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే బేలా, సిర్పూర్‌ (యూ)లో 3.8, అర్లి(టీ) 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వాంకిడిలో 4.9, జైనథ్‌లో వాంకిడి లో 4.9, చాప్రాలలో 5.1, సోనాలా లో 5.2, బజార్‌హత్నూర్‌లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వచ్చే మూడు, నాలుగు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్ల‌డించారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts