telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దేవుడి పేరుతో వ్యాపారమేంటి?

తిరుమల దివ్యక్షేత్రాన్ని వ్యాపారమయం చేస్తున్నారని కిష్కింద హనుమ జ్మభూమిట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తంచేశారు. భక్తులకు కష్టాలను గట్టెక్కించే దేవుణ్ణి అంగడి సరుకుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుణ్ణి రోడ్డు‌మీద పెట్టి స్వామి సేవలను కోటి రూపాయలకు అమ్మడమేంటని ప్రశ్నించారు. శ్రీవారి సేవలు వెల కట్టలేనివని.. సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి హాస్పిటల్ కట్టాలంటే అది సమంజసం కాదన్నారు.స్వామి పేరు చెప్పి సొమ్ము ఒకడిది..సోకు మరొకడిది అనే‌విధంగా టిటిడి వ్యవహరిస్తోందని.. సేవల అమ్మకంపై టిటిడి‌ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.

ఇప్పటికే టిటిడి‌ బోర్డు నవ్వుల పాలైందని.. ఆలయాలను కబ్జా చేసుకుని నిధులను తమ ప్రభుత్వం ఎజెండాలకు వినియోగించుకోవడం చట్ట విరుద్ధమన్నారు. ఇంత జరుగుతుంటే జియ్యర్ స్వాములు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు..

Related posts