telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వం కోడెలను వేధించింది: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల మృతి పట్ల తీవ్ర విచారం చేసియా ఆయన వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. కోడెలను వెంటాడి, వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.

పలు కేసుల్లో కోడెలకు బెయిల్ వచ్చినా ఆయనపై మళ్లీ కేసులు పెట్టాలని చూశారని అన్నారు. టీడీపీ నేతలను ఎంతో మందిని వెంటాడుతున్నారని ఆరోపించారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలకు సూచించారు.

Related posts