ఢిల్లీ పర్యటనలో అరకు కాఫీపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కేంద్ర మంత్రులకు, ముఖ్యులకు జ్ఞాపికలు, శాలువాలతో పాటు అరకు కాఫీ బాక్సులను చంద్రబాబు అందచేశారు.
వాటిని ఉపయోగిస్తున్నారా అని చంద్రబాబు తెలుసుకొంటున్నారు. తాజాగా కేంద్రమంత్రులకు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్, సీఆర్ పాటిల్, జితేంద్రసింగ్ కు అరకు కాఫీ బాక్సులను అందజేసిన సీఎం చంద్రబాబు.
అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్న చంద్రబాబు. చంద్రబాబు అరకు కాఫీ ప్రమోషన్ పై స్పందిస్తున్న కేంద్రమంత్రులు.
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ను అందరూ వినియోగించుకుంటున్నారన్న ప్రహ్లాద్ జోషి .
రాజ్‍నాథ్ తో నూ అరకు కాఫీపై ప్రస్తావించిన చంద్రబాబు. జలశక్తి మంత్రికి ప్రత్యేకంగా అరకు కాఫీ బాక్స్ అందచేశారు.
తాము అరకు కాఫీని వాడుతున్నామని చంద్రబాబు కు సీఆర్ పాటిల్ తెలియచేసారు.