ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఏర్పాటు చేయబడిన ధరణి కంట్రోల్ రూంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సందర్శించారు. ధరణి వెబ్ సైట్ ను ఇప్పటి వరకు 5.84 లక్షల మంది తిలకించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేశారు. 2622 రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా రూ.7.77 కోట్లు చెల్లించారని ఆయన తెలిపారు. మరో 6,239 మంది స్లాట్ బుక్ చేసుకోగా వారిలో 5,971 మంది డబ్బులు చెల్లించి సభ్యులుగా చేరారని అన్నారు. ధరణి కంట్రోల్ రూంలో 100 సభ్యులు బృందాలుగా పనిచేస్తూ.. సాంకేతిక సమస్యలను పరిశీలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, స్టాంపులు మరియు రిజిష్ట్రేషన్ల శాఖ, ఐ.జి. శ్రీ శేషాద్రి ఇతర అధికారులు ధరణి పోర్టల్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణీ పోర్టల్ ను సమర్థవంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను కోరారు.
previous post


తనను గద్దె దింపేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు: కుమారస్వామి