విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య ఏదో వివాదం కొనసాగుతుంది అని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటివరకు ఒకరినొకరు కలిపి మొత్తం 7 సార్లు రన్ ఔట్ చేసుకున్నారు. అప్పటినుండి ఈ తరహా వార్తలు ప్రారంభమయ్యాయి. అలాగే గతేడాది ప్రపంచ కప్ లో భారత్ ఓడిపోయిన సెమీ ఫైన్సల్ మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ కు సంబంధించి విరాట్ తీసుకున్న నిర్ణయం రోహిత్ కు నచ్చలేదు అని ప్రచారం జరిగింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 తర్వాత భారత్ వెళ్లనున్న ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ ను ఎంపిక చేయకపోవడం వెనుక విరాట్ హస్తం ఉన్నట్లు వార్తలు రావడంతో… వీరి మధ్య ఉన్న వివాదం రాజుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఇప్పుడు ఆ వార్తలు అన్ని నిజమనేలా.. వీరి మధ్య మరి ఇంతలా వివాదం ముదిరిందా అనేలా ఓ ఘటన జరిగింది. అదేంటంటే… ఈ రోజు భారత కెప్టెన్ బర్త్ డే. ఆ సంధర్బంగా విరాట్ అభిమానులు, సెలబ్రెటీలు, క్రికెటర్లు అందరూ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ మాత్రం కోహ్లీకి విషెస్ చెప్పలేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30న రోహిత్ బర్త్ డే కు కోహ్లీ ట్విట్ చేసాడు. కానీ ఇప్పుడు రోహిత్ చేయలేదు. దాంతో ఈ కొంత కాలంలోనే రోహిత్-కోహ్లీ మధ్య విషెస్ చెప్పుకోలేనంత వివాదం ముదిరిందా.. అని క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
previous post
వ్యభిచారం తప్పుకాదు… శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు