telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్

ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించిన సీఎస్, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశాలు.

స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద చేపట్టిన పనులు పూర్తి చెయాలి,
పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులకు నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ (TS) కు బదులు టీజీ (TG) గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీజీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ దీనిని పాటించాలని ఆదేశించారు.

Related posts