తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 463 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక నలుగురు కరోనాతో మృతిచెందారు. ఇదే సమయంలో 364 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205 కు చేరగా.. రికవరీ కేసులు 3,00,833 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,694 మంది మృతి చెందారు.. రికవరీ రేటు దేశంలో 94.2 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 97.92 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,678 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 1,723 మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.. ఇక, నిన్న ఒకే రోజు 42,461 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 1,00,95,487 కు చేరుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
previous post