పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై స్పందించాడు. సీబీఐ దాడులకు భయపడే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారారని ఆరోపించారు. ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రజా వేదిక ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ, ప్రజావేదికను తమకు కేటాయించాలని సీఎం జగన్కు చంద్రబాబే స్వయంగా లేఖ రాశారన్నారు.
బాబు విదేశాల్లో ఉన్న సమయంలో ప్రజావేదిక ను స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. దీనిని తామంతా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ, కనీస సమాచారం ఇవ్వకుండా ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇతర కార్యక్రమాలు చేపడితే చంద్రబాబు భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలపై వేటు వేసే వరకూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది: లోకేశ్