నాడు రాష్ట్ర విభజన కన్నా నేడు జగన్ పాలన కారణంగానే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు . అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల హింస, దాడులు పెరుగుతాయని అన్నారు.
సీఎం జగన్ మొండివైఖరి ప్రదర్శిస్తే తాము చట్టసభల్లో పోరాటం సాగిస్తామని తెలిపారు. చంద్రబాబు పథకాలు, టీడీపీ హయాంలో సాధించిన అభివృద్ధి కనిపించకూడదని కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది..