ఎప్పుడు కనివిని ఎరగని కూటమి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కనిపించిన విషయం తెలిసిందే. అదే టీడీపీ-కాంగ్రెస్ కూటమి. ఇది రేపటి లోక్ సభ ఎన్నికల సందర్భంగా కూడా కొనసాగించాలని ఆ పార్టీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుంతియా టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. దీనితో ఈ విషయాన్ని టీటీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై పార్టీ ముఖ్యులతో చర్చించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నుంచి పోటీ చేయాలని టీడీపీ భావించింది. అయితే అధిష్ఠానం నిర్ణయం నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు అసంతృప్తికి గురయ్యారు.