telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ సభలు నిర్వహిస్తోంది.. కఠిన చర్యలు తీసుకోండి: అఖిల ప్రియ

bhuma akhila into ycp soon

ఆంధ్రప్రదేశ్ లో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు సభలు నిర్వహిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తూ వారు లాక్‌డౌన్‌ సమయంలోనూ సభలు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. కర్నూలులో వైసీపీ నేతలు నిర్వహించిన ఓ సభపై టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ స్పందించారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖను కోరారు.

‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు చాలా ప్రమాదంలో ఉంది.. ప్రతిరోజు మనుషులు చనిపోతున్నారు.. క్వారంటైన్‌కు వెళుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభను జరపడానికి నంద్యాల ఎంపీ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను’ అని అఖిల ప్రియ ట్వీట్ చేశారు. 

Related posts