telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తలపతి విజయ్ రెమ్యూనరేషన్ ఏకంగా 100 కోట్లు…!?

Vijay

చిత్రసీమలో అగ్రహీరోలు ఒక్కొక్క చిత్రానికి రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకుంటారనే విషయంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది. అయితే ఈ విషయం దర్శక నిర్మాతలకు, కంపెనీ ఆడిటర్‌, ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులకు మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకు చాలా తక్కువగా ఈ విషయం గురించి తెలుస్తుంది. తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అజిత్‌, విజయ్‌ లాంటి సూపర్ స్టార్లు రెమ్యూనరేషన్‌ గా దాదాపుగా రూ.40 నుంచి రూ.50 కోట్లు తీసుకుంటూ ఉండొచ్చని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేకాదు హీరోల ఆయా చిత్ర విజయాలను, కలెక్షన్‌, టోటల్‌ బడ్జెట్‌ను బట్టి కూడా రెమ్యూనరేషన్‌ మారుతూ ఉంటుంది. తాజాగా కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ మాత్రం ఓ సినిమాకి వందకోట్లు అడిగాడట. ఇది కాకుండా వందకోట్ల మీద జీఎస్టీ కూడా నిర్మాతే భరించాలని కండిషన్‌ పెట్డాడట. వందకోట్లకు జీఎస్టీ 18 కోట్లు అవుతుంది. అంటే ఆయన పారితోషికం మొత్తం అక్షరాల 118 కోట్లు అన్నమాట. ఆయన సినిమాలు ఎంత వసూలు చేస్తే ఇంత మొత్తం ఇవ్వాలన్న ప్రశ్నకు ఆయన అభిమానులు వెంటనే 300 కోట్లు దాకా వసూలు చేస్తాయని అంటున్నారు. అంటే సినిమా వసూలు చేసే దానిలో సగం మొత్తం ఆయనకి సమర్పించుకుంటే సినిమా చేస్తారన్నమాట. అసలు విజయ్‌కు ఇచ్చే పారితోషికంతో ఎంచక్కా రెండు చిన్న సినిమాలు తీసుకోవచ్చంటున్నారు సినీ జనాలు. కాకపోతే ఆ నిర్మాత బాలీవుడ్‌కి చెందిన వ్యక్తి కావడంతో విజయ్ అంత డిమాండ్‌ చేశాడట. బాలీవుడ్‌ వారికి అది పెద్ద మొత్తంకాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యి, విజయ్‌కి అంత రెమ్యూనరేషన్ ఇస్తే మాత్రం.. సౌత్‌లో విజయ్ రెమ్యూనరేషన్ పరంగా రికార్డ్ కొట్టినట్టే.

Related posts