telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గేర్‌ మార్చిన కారు… 15 స్థానాల్లో ఆధిక్యం

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. 150 డివిజన్ల ను 30 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. అయితే.. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు పార్టీల్లో టెన్షన్‌కు దారి తీస్తున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ పార్టీ దూసుకుపోగా.. మొదటి రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ గేర్‌ మార్చింది. ఇప్పట్టికే 15 స్థానాలకు పైగా ఆధిక్యంలోకి వచ్చింది టీఆర్‌ఎస్‌.
తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం
1. ఆర్సీపురంలో టీఆర్ఎస్ ఆధిక్యం
2. పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం
3. చందానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం
4. హఫీజ్పేట్లో టీఆర్ఎస్ ఆధిక్యం
5. హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం
6. జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ ఆధిక్యం
7. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ ఆధిక్యం
8. ఓల్డ్బోయిన్పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం
9. బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం
10. చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం
11. కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం
12. మీర్ పేట్-హెచ్ బీ కాలనీలో టీఆర్ఎస్ ఆధిక్యం
13. శేరిలింగంపల్లిల్లో టీఆర్ఎస్ అధిక్యం
14. గాజలరామారంలో టీఆర్ఎస్ అధిక్యం
15. రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ అధిక్యం

 

Related posts