telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెండో పెళ్ళికి సిద్ధమైన ‘7/G బృందా‌వ‌న కాల‌నీ’ హీరోయిన్ ?

Sonia

ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో వరుసగా సినీ తారల పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తాజాగా ‘7/G బృందా‌వ‌న కాల‌నీ’ ఫేమ్ సోనియా అగ‌ర్వాల్ రెండో పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ.. మొన్న వధువు మెడలో వరుడు తాళి కడుతున్న వీడియో షేర్ చేసి తన రెండో పెళ్లి మ్యాటర్‌పై చిన్న హింట్ ఇచ్చింది.

ఆ తర్వాత నిన్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ల‌కు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేస్తూ మరో రెండు రోజులే అని పేర్కొంది.


ఇక ఈ రోజు (జులై 24) కారుపై 25-07-2020 అని రాసి ఉన్న పిక్ పోస్ట్ చేస్తూ మరొక్క రోజు మాత్రమే అని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే రేపు (శనివారం) అమ్మడు రెండో పెళ్లి చేసుకోబోతోందని స్పష్టమవుతోంది. గతంలో.. తనను తమిళ సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు సెల్వ రాఘవన్‌‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సోనియా అగర్వాల్ ఆ తర్వాత ఆయనతో విడాకులు చేసుకుంది. 2006 లో పెళ్లి చేసుకున్న ఈ జోడీ మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో 2010లో విడిపోయారు. అయితే అప్పటి నుంచి దాదాపు పదేళ్లు ఒంటరిగానే ఉన్న సోనియా అగర్వాల్.. ఇప్పుడు మరో పెళ్ళికి సిద్దమైనట్లు సంకేతమివ్వడంతో రేపే సోనియా రెండో పెళ్లి అని అంతా అనుకుంటున్నారు.

Related posts