telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాహన ప్రమాద నివేదికలు : .. హెల్మెట్ లేకపోవటం వల్లనే.. 43వేల మృతులు..

helmet for both is compulsory

ఒక్క హెల్మెట్ ధరించనందు వల్ల 2018లో రోడ్డు ప్రమాదాల్లో 43,600 మంది ప్రాణాలు కోల్పోయారని వివిధ రాష్ట్రాల పోలీసు నివేదికలు వెల్లడించాయి. 2017 లో కంటే 35,975 మంది అంటే 21 శాతం అధికంగా ద్విచక్రవాహనచోదకులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. ద్విచక్రవాహనాలు నడిపే డ్రైవర్లే కాకుండా వీటిపై వెనుక కూర్చున్న 15,360 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. గుజరాత్ రాష్ట్రంలో గత ఏడాది 958 మంది హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతూ మృత్యువాత పడ్డారు. దీంతోపాటు ద్విచక్రవాహనాల వెనుక కూర్చున్న వారిలో 560 మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో 790 మంది ద్విచక్రవాహన చోదకులు మరణించారు. వీరితోపాటు ద్విచక్రవాహనాల వెనుక కూర్చున్న వారిలో 450మంది మరణించారు.

ద్విచక్రవాహనాల వెనుక కూర్చున్న వారు ప్రమాదాల్లో మరణిస్తున్నా, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల పోలీసులు వెనుకకూర్చున్న వారు హెల్మెట్ ధరించకున్నా చలానాలు విధించడం లేదు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలు నడిపి మరణించిన వారి సంఖ్యలో యూపీ అగ్రస్థానంలో నిలిచింది. గత సంవత్సరం యూపీలో 6,020 మంది మరణించారు. మహారాష్ట్రాలో 5,232 మంది హెల్మెట్ ధరించని వారు ప్రమాదాల బారిన పడి మరణించారు. తమిళనాడులో హెల్మెట్ ధరించని వారిలో 5,048 మంది మృత్యువాత పడ్డారు. దీంతోపాటు కార్లలో సీటు బెల్టు ధరించని వారిలో 24,400 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని పోలీసు రికార్డులు చెపుతున్నాయి. హెల్మెట్ ధరించకున్నా, సీటు బెల్టు పెట్టుకోని వారే అధికంగా ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారని తేలింది.

Related posts