తల్లులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తల్లికి వందనం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు (గురువారం) తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులు ఇవ్వాలని నిర్ణయించింది.
రేపే (జూన్ 12) తల్లికి వందనం నిధులు విడుదల కానున్నాయి.
అడ్మిషన్లు పూర్తి అయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తూ ఈరోజు అర్ధరాత్రికి ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్ అని మంత్రి లోకేష్ అన్నారు .
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం.
సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందుతుంది.
67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం అని లోకేష్ అన్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది అన్నారు.