telugu navyamedia
రాజకీయ

గుజరాత్‌ అలర్లు: శివుడిలా 19 ఏళ్ల పాటు మోదీ బాధ‌ను దిగ‌మింగున్నారు..

*మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడం శుభపరిణామం
*త‌మ‌పై చేసిన ఆరోప‌ణ‌లు రాజ‌కీయ ప్రేరిపితం
*సిట్ విచార‌ణ‌లో ఆరోప‌ణ‌లు అబద్దాల‌ని కోర్టు న‌మ్మింది..

*శివుడు కంఠంలో  విషాన్నిదాచుకున్నట్లు మోదీ

 19 ఏళ్లు తనలోనే దాచుకున్నారు..

*మోదీ బాధను దగ్గరగా చూశా..

పరమ శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని గుజరాత్​ అల్లర్లపై  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న అలర్ల దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది.

ఈ క్రమంలోనే గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఏఎన్‌ఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని ఎన్జీవోలు, మీడియా సంస్థలు కలిసి మోదీపై బురదజల్లాయి. కానీ, వెలుగుతున్న సూర్యుడిలా మోదీ ఆరోపణల నుంచి బయటకు వచ్చారు.  

గుజరాత్‌ అల్లర్లలో మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడం శుభపరిణామం అన్నారు. ఆ బాధను ప్రధాని మోడీ భరిస్తుండటం తాను దగ్గరగా చూశానని అన్నారు. ఒక దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి మాత్రమే ఆ అంశం గురించి ఏమీ మాట్లాడకుండా నిలబడగలడు.. ఎందుకంటే ఆ కేసు న్యాయస్థానంలో ఉంది’’ అని అమిత్ షా అన్నారు.

 సిట్‌ విచారణను తాము ప్రభావితం చేయలేదని.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని చెప్పారు. ఈ కేసు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని.. కానీ ఇప్పుడదంతా తొలగిపోయిందన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై కూడా అమిత్ షా స్పందించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే స‌మ‌యంలో మోదీ ధ‌ర్నా చేయ‌లేద‌ని, త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో ధ‌ర్నా చేయించ‌లేద‌న్నారు. సీఎంను సిట్ విచారించాల‌ని భావిస్తే, ఆయ‌న దానికి స‌హ‌క‌రించిన‌ట్లు తెలిపారు. నిర‌స‌న‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Related posts