గురువారం జరగనున్న తొలివిడత జనరల్ ఎలక్షన్స్ కు అంతా సిద్ధం అయ్యింది. అయితే నేడు చివరి రోజు కావడంతో దేశం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అలోచించి ఓటు వేయాలని సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు సుధేరి బాబు ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో” రేపు అందరూ ఓటు వేస్తున్నారు కదా .. అలోచించి ఓటు వేయండి.. వెయ్యి.. రెండు వేలు మీ పిల్లల చదువులకు కూడా పనికిరాదు. అలాగే మీకు ఆపద వస్తే మీ ప్రాణాలను కూడా కాపాడలేదు. మీ మతం మీకు ఉద్యోగం ఇవ్వదు అలాగే మీ కులం మీ ఇంటి ముందు రోడ్లు వేసి ఇవ్వదు. సో డబ్బుకి కులానికి మతానికి కాకుండా మీ భవిష్యత్తుకు – రాష్ట్ర , దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయండి.. ఎమోషన్స్ తో కాకుండా లాజిక్ తో ఆలోచించండి.. జై హింద్” అంటూ ప్రజలకు హితవు చెప్పారు.
next post
ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం… బాలకృష్ణ వ్యాఖ్యలపై సి.కళ్యాణ్