ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు.
డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు.
రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతించినందుకు ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం తరఫున ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశానికి మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరైనారు.

