telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం శుభవార్త

దేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..ఇప్పుడు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్ల వయస్సు దాటటిన వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇవాళ మీడియాతో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ చేయనున్నారు. అర్హులైన వారందరూ టీకా కోసం నమోదు చేసుకోవాలని, వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్ర సంఘాల సూచన మేరకు కరోనా టీకా రెండో డోసును నాలుగు నుంచి 8 వారాల మధ్య తీసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

Related posts