ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన అరెస్ట్ పై ఆ పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
‘అచ్చెన్న, ఉమ, యనమల, కాల్వ, పరిటాల, నారాయణ ఇలా టీడీపీ హయాంలోని మంత్రులు దోచుకున్న ప్రజాధనంలో 60 శాతం పెద బాబు, చిన బాబులకు ముడుపులుగా వెళ్లాయని ఆరోపించారు. అందుకే వారి హయాంలో అవినీతిని ప్రోత్సహించారని దుయ్యబట్టారు. ఇప్పుడు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుల్లా నాటకాలాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విజయసాయి విమర్శించారు.