telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వీడియో వైరల్ : వీధికుక్కలు దాడిలో చిరుత మృతి

పులిని చూస్తే మనుషులే కాదు ఎటువంటి జంతువైనా భయంతో వణికిపోవాల్సిందే. అలాంటిది ఓ చిరుతపులి కుక్కల దాడిలో అత్యంత దయనీయంగా మృతి చెందింది. వాటితో పోరాడలేక చివరికి ప్రాణాలు వదిలిన ఘటన కర్ణాటక-కేరళ సరిహద్దులో కేరళలోని కాల్పెట్టా అటవీ ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు పది శునకాలు ఒక్కసారిగా చిరుత మీద దాడిచేయడంతో అది నిస్సహాయ స్థితికి చేరుకుంది. కాసేపు ప్రతిఘటించినా చివరికి ఓడిపోయింది. చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియరాలేదు. అయితే ఎవరో కొంతమంది దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… విపరీతంగా వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియోను చూసేయండి. 

Related posts