కరోనా కారణంగా క్రికెట్ నిబంధనలో చాలా మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్పులో ఓ నిబంధనను అలవాటులో భాగంగా అతిక్రమించాడు స్టోక్స్. బంతికి లాలాజలం రుద్దుతూ దొరికిపోయాడు. ఇంకేముంది ఫీల్డ్ అంపైర్ల ఆగ్రహానికి గురయ్యాడు. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతిని షైన్ చేసే క్రమంలో బౌలర్లు లాలాజలం ఉపయోగించే అంశంపై నిబంధనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో ఐసీసీ గతేడాది నుంచి కఠిన రూల్స్ అమలుచేస్తోంది. పూణే వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. భారత్ బ్యాటింగ్ చేస్తుండగా.. నాలుగో ఓవర్‌ను పేసర్ రీస్ టాప్లే వేశాడు. రెండో బంతి తర్వాత బెన్ స్టోక్స్ మర్చిపోయి ఆ బంతికి లాలాజలం రుద్దాడు. దీనిని గమనించిన అంపైర్లు నితిన్ మేనన్, వీరేందర్ శర్మ.. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్‌ను పిలిచి హెచ్చరించారు. ఆపై బంతిని శానిటైజ్ చేసి ఆటను తిరిగి ఆరంభించారు.
							previous post
						
						
					
							next post
						
						
					

