telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈటల పై ప్రభుత్వ మెడికల్ జేఏసీ అసహనం…

అసెంబ్లీలో మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ మెడికల్ జేఏసీ చైర్మన్ డా. రమేష్…. ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్‌లో వైద్యం చేస్తున్నారని.. అలా చేస్తున్న వారిని తొలగిస్తామంటూ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. చట్టంలో ప్రైవేట్‌లో ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఉన్నప్పుడు.. మంత్రి అందుకు విరుద్ధంగా మాట్లాడటం సరికాదన్నారు డాక్టర్ రమేష్. కాగా, ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తూ.. ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించే వారిని విధుల నుంచి తొలగిస్తేనే సిబ్బంది కొరత సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. తెలంగాణలో ఎక్కడ కూడా వైద్యుల కొరత లేదన్న ఆయన.. వైద్య కళాశాలల అనుబంధ దవాఖానాల్లో వైద్యులు తగినంత మంది ఉన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన ఆయన.. అలాంటి వారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

Related posts