telugu navyamedia
సినిమా వార్తలు

చిరంజీవి గారిలో ఆ లక్షణం చూడ ముచ్చటగా ఉంటుంది-జక్కన్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఇందులో చిరు తనయుడు మెగా పవర్‌స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ ఓ కీలకమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” అందరు నన్ను అడుగుతూ ఉంటారు.. ఇంత సక్సెస్ అందుకున్న అంత హంబుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు అని.. ఒక్కసారి చిరంజీవి గారిని చూడండి. ఆయన నుంచి నేర్చుకున్న వాటిలో హంబుల్ నెస్ ఒకటి.. ఎంత ఎదిగినా హంబుల్ గా నేల మీద నిలబడడం ఆయన నుంచే నేర్చుకోవాలి. 

‘మగధీర’ టైమ్‌లో చిరంజీవిగారు కథ విన్నారు. అప్పుడు రామ్‌ చరణ్‌ విషయాలన్నీ దగ్గరుండి చిరంజీవిగారే చూసుకుంటారేమో అని అనుకున్నాను. కానీ చరణ్‌కి చిరంజీవిగారు ఎటువంటి సలహాలు ఇవ్వరని నాకు తెలిసింది. చరణ్‌ నువ్వు ఇలా చెయ్‌ అలా చెయొద్దు అని చెప్పరు. ఈ సినిమాలో నీ యాక్టింగ్‌ బాగుంది, నీ యాక్టింగ్‌ బాలేదని చెప్పరు. ఇప్పటి వరకు తను చేసినవన్నీ చరణ్‌ తన సొంతంగా నేర్చుకున్నాడు.

మెగాస్టార్ కొడుకు అయ్యిండొచ్చు కానీ ఇప్పుడు చరణ్ ఇలా ఉన్నాడు అంటే అది తన హార్డ్ వర్క్ మాత్రమే.. ఏదో ఒకరోజు చిరంజీవి గారి అంత కాకపోయినా ఆ రేంజ్ కు కి నువ్వు ఎదుగుతావ్.. అది నాకు నమ్మకం ఉంది. 

ఇక చిరు గారి లో నచ్చిన మరో లక్షణం కొడుకు పక్కన ఉన్న ఆయనే డామినేట్ చేయాలనే విధానం చాలా చూడముచ్చటగా ఉంటుంది. 

చిరు గారి లో నచ్చిన మరో లక్షణం కాంపటేటివ్‌నెస్‌ నచ్చింది. పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్‌ చేయాలని చిరంజీవి కోరుకుంటారు. ఆ లక్షనం చూడటానికి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది.

ఒక అభిమానిగా చిరంజీవి గారే బాగ చేసారని అనిపిస్తారు. కానీ ఒక డైరెక్టర్‌గా నాకు నా హీరో చరణ్ నే మీకంటే బెటర్‌ సర్‌ అనడంతో రాజమౌళితో పాటు పక్కనే ఉన్న మెగాస్టార్‌ సైతం నవ్వుకున్నారు.

ఇక ఈ సినిమా గురించి నేను విష్ చేయడం లేదు.. నమ్మకంగా చెప్తున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు.

Related posts