telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన సోనూసూద్

Sonu-Sood

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు. దీంతో సోనూసూద్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోన్న విష‌యం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి సైతం ఆయన సేవలను గుర్తించి, ప్రత్యేక అవార్డును ఇచ్చింది. మరోవైపు సోనూ సాయంపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ.. ఆయన వాటిని పట్టించుకోవడం లేదు. వీలైతే మీరు సాయం చేయండి అంటూ విమర్శకులకు సూచిస్తున్న ఆయన.. ఇప్పటికీ తన సాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్‌ సర్‌ నాకు మాల్దీవులకు వెళ్లాలని ఉంది. నాకు సాయం చేయండి అని సోనూకు ట్వీట్ చేశారు. దానికి స్పందించిన సోను.. మీకు సైకిల్‌ కావాలా..? రిక్షా కావాలా..? అని కామెంట్ పెట్టారు. ఇక ఇటీవల సోనూసూద్ కు భారీగా ఫాలోయింగ్ పెరిగింది. చాలామంది దర్శక నిర్మాతలు సోనూని తమ సినిమాల్లో నటించాలని సంప్రదిస్తున్నారట.

Related posts