తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సంవత్సరం ఆరంభంనుంచి సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతివ్వాలని నిర్ణయించింది. కరోనా పరిస్థితులతో సర్వదర్శనాలను నిలిపివేసింది. 300 రూపాయలతో ప్రత్యేక ప్రవేశ దర్శనటిక్కెట్లను మాత్రమే జారీచేసింది.
ఇక నుంచి ప్రతిరోజూ ఆన్ లైన్లో ఐదువేలు, నేరుగా పొందేవారికి 5 వేల టిక్కెట్లను అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. 25వ తేది ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లను విడుదలచేస్తారు. కొత్త సంవత్సరాది ఆరంభంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ముందురోజు డిసెంబరు 31 తేదీన తిరుపతి శ్రీనివాసం, విష్ణునివాసాల్లో సర్వదర్శన టిక్కెట్లను జారీచేస్తారు.
సామాన్య భక్తులకు ఈ టిక్కెట్లను ఉచితంగా అందిస్తారు. రోజుకు ఐదువేల టిక్కెట్లనుమాత్రమే జారీచేయాలని నిర్ణయించారు. జనవరికి సంబంధించి తిరుమల వెంకన్న దర్శనార్థం ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్ లైన్లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రోజుకు 20 వేల టిక్కెట్ల చొప్పున ఆరులక్షల 20 వేల టిక్కెట్లను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల సంఘం ఏకపక్షం: యామిని