telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రైలు చక్రాలు తయారీలో విశాఖ స్టీల్స్ తొలి అడుగు..

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ స్టీల్‌ ప్లాంట్ మరో ముందడుగు వేసింది. రైలు చక్రాలు తయారీలో విశాఖ స్టీల్స్ తొలి విడుతగా 51 లోకో వీల్స్ తయారు చేసి ఇండియన్ రైల్వే‌కి సరఫరా కూడా చేసింది.

లోకో వీల్స్ తయారీ కోసం రూ. 1700 కోట్లతో లాల్ గంజ్‌, రాయబరేలీలో ప్రత్యేక యూనిట్‌ని నెలకొల్పింది. లాల్ గంజ్ నుంచి తొలిసారిగా నిన్న రాత్రి 51 లోకో వీల్స్‌ని ఇండియన్ రైల్వే కి వైజాగ్ స్టీల్స్ ఉన్నతాధికారులు పంపించారు.  

అయిదు దశాబ్దాలకుపైగా వైజాగ్ స్టీల్స్ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంది. ప్రతీ ఏడాది 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును తయారు చేస్తోంది. దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గాను రికార్డుల్లోకి ఎక్కింది.

ఇంతలో వైజాగ్ స్టీల్స్‌ను ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి షాక్ ఇచ్చింది. దశాబ్దాల కిందటే రాష్ట్రంలో వైజాగ్ స్టీల్స్‌ను ప్రైవేట్ క‌ర‌ణ‌ చేయోద్దంటూ ఉద్యమాలు సాగాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవడం లేదు.

అయితే ఆ నాటి నుంచి ఈ నాటి వ‌ర‌కు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు నిరసనకు దిగారు. అంతేకాకుండా ఉద్యోగుల చేపట్టిన దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వైసీపీ మిన‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.

Related posts