పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్‌కు ఒక లెక్కుందని తెలిపారు. పోతిరెడ్డిపాడుకు జీవం పోసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు.
పోతిరెడ్డిపాడుపై ఏపీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షులకు ఏకాభిప్రాయం లేదని తప్పుబట్టారు. పోతిరెడ్డిపాడుపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరతామని, లేఖలు, దొంగ దీక్షలతో బీజేపీ నాయకులు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. చేతనైతే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా ఇప్పించాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
షర్మిల వ్యాఖ్యల పై స్పందించిన ఎంపీ అరవింద్…