telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముచ్చింతల్​లో 8వ‌రోజు వైభ‌వంగా శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు..

హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్ లో ఎనిమిదో రోజు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు చిన్న జీయర్ స్వామి ఆధ్వ‌ర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి.

వైకుంఠాన్ని తలపిస్తోన్న శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది. రాజకీయ, సినీ, వివిధ రంగాలకు చెందిన ప్ర‌ముఖులు ఇక్కడకు విచ్చేస్తున్నారు. 11వ శతాబ్దానికి చెందిన వైష్ణవ గురువు శ్రీరామానుజాచార్యుల స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’.

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో 8వ రోజు కార్యక్రమాలు ఇవే..

*ఉదయం 6.30 అష్టాక్షరీ మంత్ర పఠనం
*ఉదయం 7.30 కి శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన.
*ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం
* ఉదయం 10 గంటలకు ఐశ్వర్యప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి
* ఉదయం 10 గంటలకి సంతానప్రాప్తికై వైనతేయ ఇష్టి
* ఉదయం 10.30 కి యాగశాలలో చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధికి హయగ్రీవ పూజ
*ఉదయం 10.30 కి దేశంలోని ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు. ఇందులో 200 మంది సాధు, సంతులు, పీఠాధిపతులు, పాల్గొననున్నారు.
* మధ్యాహ్నం 12.30 కి పూర్ణాహుతి
* మధ్యాహ్నం 2.30కి ప్రవచనమండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు
*సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం
* రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి

Related posts