బ్రోచెవారెవరురా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. పెద్ద స్థాయి హీరో కాకపోయినా తన స్థాయిలో మంచి కథలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకటే కథ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ 36 ఏళ్ల నటుడు 2009లో బాణం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సోలో, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ ఇలా ఎన్నో సినిమాలలో తన ప్రతిభను కనబరిచి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శ్రీ విష్ణు గాలి సంపత్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సినిమాను ఓకే చేశారు. ఈ సినిమాకు సరికొత్త పేరును ఖరారు చేశారు. ఈ చిత్రానికి అర్జున ఫల్గుణ అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ మేరకు సినిమా యూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను అందరిలా కాకుండా సరికొత్తగా డిజైన్ చేశారు. ఈ సినిమా పోస్టర్‌లో శ్రీవిష్ణు తన భుజంపై ఓ మూట వేసుకొని పరిగెడుతున్నారు. అతడి వెనుక హీరోయిన్ అమృతా అయ్యర్ కూడా పరుగులు తీస్తున్నారు. వారిద్దరినీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈ సీన్ మొత్తాన్ని డైరెక్ట్‌గా కాకుండా నీటిలో ప్రతి బింబంగా పోస్టర్ ఉంది. ఈ సినిమాను తేజ మార్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్ సినిమాపై సరికొత్త అంచనాలు కలిగిస్తోంది.
next post