అప్పటివరకు బాగానే ఉన్న ఓ వ్యక్తి సడన్‌గా గుండె పట్టుకొని పడిపోయాడు. అది చూసిన వాళ్ళు వెంటనే అంబులెన్సు కోసం ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అంబులెన్సులోని సిబ్బంది, పేషెంట్‌ను పరిశీలించారు.అతని గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటోందని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. ఏడుమైళ్ల దూరంలోని ఆస్పత్రికి హడావిడిగా బయలుదేరిన ఆ అంబులెన్సు మార్గమధ్యంలో ఓ గుంతలో పడి భారీ కుదుపుకు గురైంది. దాంతో డ్రైవర్‌పై విరుచుకుపడిన అంబులెన్సు సిబ్బంది.. పేషెంట్‌కు ఏమైనా జరిగిందేమోనని భయపడ్డారు. తీరా చూస్తే వారి పేషెంట్ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. దాంతో షాకైన వారికి ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. అంబులెన్సు గుంతలో పడటమే ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడిందని వైద్యులు చెప్తున్నారు. ఆ భారీ కుదుపుతో ఉలిక్కిపడ్డ అతని గుండె.. మళ్లీ నెమ్మదిగా సాధారణ వేగంలో కొట్టుకోవడం మొదలెట్టిందని, ఇది నిజంగా అద్భుతమన్న వైద్యులు.. సాధారణంగా గుండె వేగం పెరిగితే కరెంట్ షాక్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. అమెరికాలోని నెబ్రస్కాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
next post
వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిది: దేవినేని