telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రాజమహేంద్రవరం : … దసరాకు .. ప్రత్యేక రైళ్లు..

special train between vijayawada to gudur

ఈనెల 29 నుంచి దసరాను పురస్కరించుకుని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-కాకినాడ-సికింద్రాబాద్‌కు స్పెషల్‌ ట్రైన్‌లు రెండు స్లీపర్‌ క్లాస్‌, ఒక ఏసీసీఎన్‌ కలిగి 17 కోచ్‌లతో ఈ ట్రైన్‌ ఉంటుంది. సికింద్రాబాద్‌లో రాత్రి 8.45 గంటలకు ప్రారంభమై కాకినాడకు ఉదయం 7.25 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, రాయన్నపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమహేం ద్రవరం, ద్వారపూడి, సామర్లకోట మీదుగా కాకినాడ చేరుకుంటుంది.

హైదరాబాద్‌-నర్సాపూర్‌ ట్రైన్‌ సికింద్రాబాద్‌-నాగర్‌సోల్‌, సికింద్రాబాద్‌-కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్‌ ఈ నెల 29న, వచ్చే నెల 13వ తేదీ ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28 నుంచి 12వ తేదీ వరకు చెన్నై-చాప్రా, సికింద్రాబాద్‌-ధన్‌పూర్‌, మైసూర్‌-బర్భాంగ (వీక్లీ), వచ్చే నెల 3 నుంచి 10వ తేదీ వరకు కేఓపీ-ధన్‌బాద్‌ (వీక్లీ), వచ్చే నెల 4 నుంచి 11వ తేదీ వరకు పూర్ణా-పాట్నా (వీక్లి) రైళ్లును సౌత్‌ సెంట్రల్‌ రైల్వే నడుపనున్నది.

Related posts