telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యూకే విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్…

Air India flight

2019 చివర్లో చైనాలో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఇప్పటికి వణికిస్తోంది. అయితే ఇదే సమయంలో యూకేలో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది.. భారత్‌లోనూ ఈ వైరస్ అడుగుపెట్టింది… యూకే నుంచి భారత్‌కు వచ్చినవారిలో ఇప్పటికే 29 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్‌గా నిర్ధారించారు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత యూకే, భారత్ మధ్య అన్ని విమానసర్వీసులను రద్దు చేసింది భారత్.. కానీ, ఇప్పుడు తిరిగి ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. జనవరి 8 నుండి భారత్‌, యూకే మధ్య విమానసర్వీసులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ.. ఈ విమానసర్వీసులు ఈ నెల 23 వరకు నడుస్తాయని స్పష్టం చేసింది.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మరియు హైదరాబాద్ నుండి మాత్రమే రెండు దేశాల మధ్య వారానికి 15 విమానసర్వీసులు నడపనున్నట్టు పేర్కొంది. కాగా, జనవరి 31వ తేదీ వరకు విదేశీ విమానసర్వీసులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.. అయితే, ప్రత్యేక విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవు. మరి చూడాలి ఈ కారణంగా మళ్ళీ కొత్త కేసులు పెరుగుతాయా.. అనేది.

Related posts