భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని రేపు (జనవరి 6) డిశ్చార్జ్ చేయనున్నారు. అయితే దాదా ఆరోగ్య పరిస్థితిని రోజూ పర్యవేక్షిస్తామని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ ప్రకటించింది. అయితే జనవరి 2న తన ఇంటిలో వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి రావడంతో గంగూలీ ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త ఒక్కసారిగా గంగూలీ ఫ్యాన్స్‌ను, క్రికెట్ ప్రేమికులను, క్రీడాభిమానులకు షాక్‌కు గురిచేసింది. దాదా గుండె రక్తనాళాలు మూడు చోట్ల మూసుకుపోవడంతో స్టెంట్ ను పంపి వైద్యులు క్లియర్ చేశారు. మొదట గంగూలీకి యాంజియోప్లాస్టీ చేయనున్నట్లు చెప్పిన వైద్యబృందం… తర్వాత దాదా ఆరోగ్యము కుదురుకోవడంతో దానిని వాయిదా వేసింది. అలాగే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని రేపు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయనున్నట్లు వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ తెలిపింది. అయితే సౌరవ్ గంగూలీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌరవ్ ఆరోగ్యంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు.. గంగూలీ అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ‘‘గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త విని చాలా బాధపడ్డాను.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. ఈ సమయంలో గంగూలీ కుటుంబానికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను”అంటూ ట్వీట్ చేశారు.
previous post