ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులకు ఏర్పాట్లు చేస్తూ ఫిల్మ్‌స్టార్ సోనూ సూద్ అందరి ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. సోనూ సూద్ చేస్తున్న సేవ కార్యక్రమాలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ఆదివారం రాత్రి సీఎం ఉద్దవ్‌ను సోనూ సూద్ కలిశారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. హీరో సోనూ సూద్‌కు అండగా నిలిచారు. అయితే సోమవారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్‌లో వలస కూలీలను కలిసేందుకు వెళ్లిన సోనూసూద్‌కు చేదు అనుభవం ఎదురైంది. హీరో సోనూ సూద్‌ను రైల్వే పోసులీలు అడ్డుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ విషయంలో తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ముంబై పోలీసులు చెప్పారు. బాంద్రా టర్మినస్ నుంచి యూపీకి వెళ్తున్న శ్రామిక్ రైలు ప్రయాణికులను సోనూ కలిసేందుకు వెళ్లారు. అయితే ఆ హీరోను ఆర్‌పీఎఫ్ దళాలు అడ్డుకున్నాయని, తాము కాదు అని ముంబై నిర్మల్ నగర్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ శశికాంత్ భంద్రే తెలిపారు.
previous post

