కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న “సమర్ధ్” పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ లో 12,000 మంది యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. దుస్తుల తయారీ లో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తారని ఇటీవల తెలుగులో ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల “సమర్థ్” అనే పథకాన్ని తీసుకొచ్చిందని స్మృతీ ఇరానీ తెలిపారు. యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వీరికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర జౌళీ పరిశ్రమ శాఖ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని ట్వీట్ చేశారు. మంత్రి తెలుగులో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.