ఉత్తర ప్రదేశ్ లో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన 20 ఏళ్ల యువతి గ్రామమైన హత్రాస్ వెళ్లేందుకు రాహుల్ ఈరోజు మరోసారి ప్రయత్నించారు. నిన్న పోలీసులు అడ్డుకోగా రాహుల్ కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు మరోసారి తన ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, కుట్రలు ప్రజలందరికీ తెలుసని అన్నారు. రాజకీయాల కోసమే రాహుల్ హత్రాస్ కు వెళ్లాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. అందువల్లే 2019 ఎన్నికల్లో బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని జనాలు కట్టబెట్టారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక నాయకుడిని మనం ఆపలేమని అన్నారు.


జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?: చంద్రబాబు