telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనాపై దుష్ప్రచారం చేస్తే కేసులు: మంత్రి ఈటల

Etala Rajender

సోషల్ మీడియాలో కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కేసులు తప్పవని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్కడ విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్ మూసివేశారన్నారు.

అయితే, తెలంగాణలో కరోనాపై దుష్ప్రచారం జరుగుతోందని, కరోనా పాజిటివ్ అంటూ ఎవరైనా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తే వారిపై కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశామని రాష్ట్రవెల్లడించారు. దయచేసి ఎవరూ తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేయవద్దని మంత్రి పేర్కొన్నారు.

Related posts