telugu navyamedia
సినిమా వార్తలు

ఘ‌నంగా పెళ్లి చేసుకున్న సింగర్‌ రేవంత్ ..

టాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, ఇండియన్‌ ఐడల్‌ 9 విజేత రేవంత్‌ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరుకు చెందిన అన్వితతో ఫిబ్రవరి 6న ఆయన వివాహం వేడుకగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు సహా, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలోనే వీరి వివాహం గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిరాడంబరంగా జరిగింది.

పలువురు గాయనీగాయకులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రేవంత్‌ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Related posts