telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్యాన్స్ చుట్టుముట్టడంతో హీరోయిన్ దుస్తులన్నీ జారిపోయాయట…!

Swetha

సాధారణంగా సెలెబ్రిటీలు బయట కన్పిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడిపోతుంటారు జనం. ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ ఫ్యాన్స్ వల్ల షాకింగ్ సంఘటన ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఓసారి ఈవెంట్‌ కోసమని రాయ్‌పూర్ వెళ్లాను. అక్కడ ఫ్యాన్స్ నన్ను చూడగానే చుట్టుముట్టేశారు. నా చుట్టూ బాడీగార్డ్స్ కూడా లేరు. ఫ్యాన్స్ మీదకు వచ్చేసరికి నా ఒంటి మీద దుస్తులన్నీ ఒక్కొక్కటికీ జారిపోయాయి. దాంతో వాళ్లే అడ్డుగా నిలబడి నా మానాన్ని కాపాడారు. ఆ సంఘటనతో నేను కొన్ని రోజులు షాక్‌లో ఉండిపోయాను” అన్నారు. శ్వేతా తివారీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆమె టీవీ రంగాన్ని ఏలుతున్నారు. ‘కసౌటీ జిందగీ కే’ అనే సీరియల్‌తో శ్వేతాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే ఆమె ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో ఓ కూతుర్ని కన్నారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అతనితో ఓ కొడుకుని కన్నారు. కానీ అతను శ్వేత కూతురిపై చేయి చేసుకుని హింసిస్తున్నాడని ఇటీవలే ఆమె కేసు పెట్టిన విషయం తెలిసిందే.

Related posts