శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ’96’ సినిమాకు రీమేక్ గావచ్చింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే.. తాజాగా శర్వానంద్ ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట. రైటర్ కోన వెంకట్ రాసిన ఈ కథ మెడికల్ బ్యాక్ గ్రౌండ్లోని లొసుగులను కామెడీ సీన్లతో చూపించబోతున్నారని… ఇదొక మెడికల్ థ్రిల్లర్ అని సమాచారం. మొదట ఈ కథ సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట. అయితే.. ప్రస్తుతం సాయి తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే ఈ సినిమాకి “నో” చెప్పాడట. అందుకే ఈ సినిమా శర్వానంద్ దగ్గరకు వచ్చిందట. ఇక ఈ సినిమాని సమ్మర్ తర్వాత నుంచి లైన్లో పెట్టనున్నట్లు టాక్. అయితే.. ఈ సినిమా ఏ రేంజ్లో ఆడుతుందో చూడాలి.
previous post
next post


పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు