ప్రముఖ మోబైలు తయారీ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ ఎ50ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను గత సెప్టెంబర్ నెలలో భారత్‌లో విడుదల చేసిన సంగతి తెల్సిందే. కాగా ఈ ఫోన్‌కు చెందిన 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్ల ధరలను శాంసంగ్ తగ్గించింది. రూ.2500 మేర ఈ ఫోన్ ధర తగ్గింది.
దీంతో ప్రస్తుతం తగ్గించిన ధరకే ఈ రెండు వేరియెంట్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 48, 5, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

