“అశోక్”, “జైచిరంజీవ” వంటి చిత్రాలతో తెలుగులో హిట్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి రెండోసారి తల్లి కాబోతోంది. 2014లో అక్షయ్ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న తర్వాత సమీర పూర్తిగా సినిమాలకు దూరమైంది. అనంతరం కుమారుడు హన్స్‌కు జన్మనిచ్చింది. హన్స్‌కు ఇప్పుడు నాలుగేళ్లు. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. హన్స్ పుట్టిన తర్వాత శరీరాకృతిపరంగా తను ఎదుర్కొన్న సమస్యలను గురించి వెల్లడించింది సమీరా. “పెళ్లికి ముందు నన్నందరూ `సెక్సీ సామ్` అని పిలిచేవారు. మొదటి సారి గర్భవతి అయి ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా బరువు 102 కిలోలకు పెరిగిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నా శరీరాకృతి నన్ను భయపెట్టేది. ఆ సమయంలో నా ఆత్మవిశ్వాసం దెబ్బతింది. ఎవరైనా ఎగతాళి చేస్తారేమోనని భయపడి బయటకు కూడా రాలేకపోయా. పూర్వపు శరీరాకృతిని తిరిగి సంపాదించడానికి రెండేళ్లు పట్టింది. వ్యాయామాలు, యోగా చేసి చాలా సహజంగానే బరువు తగ్గాను. ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతున్నాను. ఇది వరకు పడిన బాధ ఇప్పుడు లేదు” అంటూ సమీరా చెప్పుకొచ్చారు.
previous post
next post


క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ కామెంట్స్